Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్‌ని నిర్ణయించారు. బుధవారం ప్రసాద్ ఐమ్యాక్స్‌లోని బిగ్స్క్రీన్పై ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వచ్చింది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు దర్శకుడు. బాపినీడు.బి సమర్పణలో బీవిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు థ్యాంక్స్. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం, నిర్మాణ భాగస్వామిగా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది' అని అన్నారు. '1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది' అని దర్శకుడు కార్తీక్ దండు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది.