Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ బుధవారం ఈ చిత్ర విడుదలని తేదీని ఖాయం చేస్తూ చేసిన ఎనౌన్స్మెంట్ అటు చిరు అభిమానులను, ఇటు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేస్తున్నారు.
సంక్రాంతికి చిరంజీవి చాలా బ్లాక్బస్టర్లను అందించారు. రాబోయే సంక్రాంతికి థియేటర్లలో మాస్ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది. విడుదల తేదీ పోస్టర్లో చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్‌లో కనిపించారు. ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి జికె మోహన్ సహ నిర్మాత.