Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్లో బొడ్డు కోటేశ్వర రావు నిర్మాతగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దోచేవారేవారురా!'. ఈ చిత్రంలోని 'కల్లాసు అన్ని వర్రీసూ..నువ్వేలే..నీ బాసూ..' పాటను గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు చేతులు మీదుగా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'శివనాగేశ్వరరావు 'మని' చిత్రాన్ని నా స్కూల్ డేస్లో చూశాను. ఆ రోజుల్లో అది ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ఆయన సినిమాలోని సాంగ్ లాంచ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను' అని తెలిపారు.
'మహిళలస్వేచ్ఛగురించి వచ్చే ఈ పాటను ఈ కాలేజ్లో విడుదల చేయాలని మలినేని పెరుమాళ్ళుని అడిగాం. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని పాటను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు. విడుదల చేసిన పాటకు సింగిగ్, డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. బాగా పాడిన వాళ్లకు, డాన్స్ చేసిన వాళ్లకు నా నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తాను. కామెడీ థ్రిల్లర్తో పూర్తి వినోదంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం' అని చెప్పారు.
'సినిమా చూస్తే అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ కావాలి' అని కథానాయిక మాళవిక సతీషన్ అన్నారు.