Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'ఎంతవారు గాని'. ఎన్.శ్రీనివాసన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సైంటిఫిక్ థ్రిల్లర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని హీరో అడవి శేష్ రిలీజ్ చేశారు. కేవలం ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు.
ఈ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని, యూత్ ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోందని చిత్ర బృందం తెలిపింది.
నివాస్ అనే పేరుతో దర్శకుడు శ్రీనివాసన్ని 'రంగీలా' సినిమాతో ఎడిటర్‌గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత 'క్షణ క్షణం', 'గాయం', 'గోవిందా గోవిందా', 'రాత్రి' వంటి తదితర సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్‌గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించ బోతున్నారని నిర్మాతలు చెప్పారు.
ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,. విజరు కురాకుల సంగీతం సమకూరుస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.