Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద' వంటి విభిన్న సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఆయన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, 'నిజాయితీతో, క్రమశిక్షణతో ఏ పని చేసినా విజయం ఖచ్చితంగా వస్తుందనే దానికి ఉదాహరణే మా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనేదే నా ఫిలాసఫీ. ఈ 5 సంవత్సరాలలో నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువే సాధించా. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. లేటెస్ట్గా 'మసూద' సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ నేను అస్సలు ఆలోచించలేదు. 'మసూద' ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. కథల విషయంలో నేను నేరేషన్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫుల్ బౌండెడ్ స్క్రిఫ్ట్ మొత్తం చదువుతాను. కథ ఎంత డెప్త్‌గా రాసుకుంటాడో.. అంత గొప్పగా సినిమా తీయగలడని నమ్ముతాను. పూర్తి కథ చదువుతున్నప్పుడు ఆ కథ రాసిన పర్సనాలిటీ గురించి కూడా ఎక్కడో ఒకచోట నాకు తెలుస్తుంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ రిలీజ్ వేడుకలో 5గురు కొత్త డైరెక్టర్స్‌ని పరిచయం చేయాలని ఛాలెంజ్ చేసుకున్నాను. ఈ 5 సినిమాలతోనే ఆపేయను.. ఆ తర్వాత కూడా చేస్తాను. ఏ కథైనా నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి. అలాంటి కథ దొరికితే వెంటనే సినిమా ఎనౌన్స్ చేస్తాను' అని తెలిపారు.