Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి చినజీయర్ స్వామి వారి సహకారంతో బాలకృష్ణతో 'రామానుజాచార్య' ప్రాజెక్ట్‌ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించ బోతున్నాం. ప్రస్తుతం పనులు జరుగు తున్నాయి. కళ్యాణ్ ఎమ్యూజ్మెంట్ పార్క్ ప్రారంభోత్సవం రోజున ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాం. కళ్యాణ్ ఎమ్యూజ్మెంట్ పార్క్ నిర్మించడం దేవుడు ఇచ్చిన వరం' అని అన్నారు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు, నిర్మాత సి. కళ్యాణ్. నేడు (శుక్రవారం) ఆయన బర్త్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
టూరిజంకు తలమానికం..
కళ్యాణ్ ఎమ్యూజ్మెంట్ పార్క్ ప్రాజెక్ట్ చేయడం నా కెరీర్లో ఇదొక మైల్ స్టోన్ మార్క్. స్టాలిన్ ప్రభుత్వం సపోర్ట్‌తోనే చెన్నైకి హార్ట్ లాంటి ప్లేస్‌లో దీన్ని నిర్మిస్తున్నాం. ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్, ఫుడ్, కల్చరర్ ఈవెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. టూరిజంకు ఇది తలమానికంగా ఉంటుంది. అలాగే సదరన్ ఇండిస్టీకి ప్రతి ఏడాది పెద్ద ఎత్తున అవార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సపోర్ట్‌తో వచ్చే జనవరిన దీన్ని ప్రారంభిస్తాం.
ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు
సంక్రాంతి సినిమాల విషయంలో కౌనిల్స్ వ్యాఖ్యల గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే చిరంజీవి సినిమా నిర్మాతలు, బాలకృష్ణ సినిమాల నిర్మాతలు గానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయకుండా ఈ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. ఈ సంగతి వాళ్లకి కూడా చెప్పాను.
ఆయనకు బ్రేక్ ఇచ్చే సినిమా
ఎస్వీ కృష్ణా రెడ్డి 'ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు' సినిమా రెడీ అయ్యింది. ఆయనకు మళ్ళీ మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాని థియేటర్లోనే చూడాలని అనుకుంటారు. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అది. ఇంకొన్ని చిన్న సినిమాలు చేస్తున్నా.