Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా (ఎన్బికె 108 వర్కింగ్ టైటిల్) గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.
ఈ సినిమా షూటింగ్ కూడా గురువారం నుండే యాక్షన్ బ్లాక్‌తో ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ బ్లాక్‌కి వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు. బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, సంగీతం: ఎస్ తమన్, డీవోపీ: సి. రామ్‌ప్రసాద్, ఎడిటర్: తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఫైట్స్: వి. వెంకట్.