Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైతన్య పసుపులేటి, హీనా రారు జంటగా అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'జీటిఎ'. విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డాక్టర్ సుశీల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు ఆకాష్ పూరి, నందు హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈసందర్భంగా దర్శకుడు దీపక్ సిద్ధాంత్ మాట్లాడుతూ,' జీటిఎ' (గన్స్ ట్రాన్స్ యాక్షన్) సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా మీకు నచ్చుతుందని భావిస్తున్నా. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటు ఈ సినిమాలో ప్రతీ ఒక్కటీ మిమ్మల్ని అలరిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ చాలా బాగుందని రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమా ఇంతకంటే అద్భుతంగా ఉంటుందని దీమాగా ఉన్నాం' అని తెలిపారు.'ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. దర్శకుడు దీపక్ వర్క్ బాగా నచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. కొత్తదనం ఉన్న కథలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని హీరో ఆకాష్ పూరీ అన్నారు.మరో హీరో నందు మాట్లాడుతూ, ' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆకాష్ పూరి చెప్పినట్లు సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా. దర్శకుడు దీపక్ సిద్ధాంత్ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'నేను, మా డైరెక్టర్ దీపక్ కాలేజ్ టైమ్‌లో శత్రువులం. తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. తన దర్శకత్వంలో నేను హీరోగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను హీరోగా మీ ముందు ఉండటానికి దీపక్ వాళ్ళ అమ్మ కారణం. సినిమా బాగా వచ్చింది. మీ ఆశీస్సులు కావాలి' అని హీరో చైతన్య అన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, కుమరన్, సుదర్శన్, రామకృష్ణ, ఆర్ఎక్స్ 100 కరణ్, వివేక్ ఫలక్‌నుమా, రూపలక్ష్మి, చిత్రం శ్రీను, లోబో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కే రాబిన్, ఎడిటర్: గ్యారీ బిహెచ్, డిఓపీ : ప్రసాద్ బాపు.