Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు కె.దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ యూ రామ్'. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరథ్ కలిసి మన ఎంటర్టైన్మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, 'ఈ సినిమా మంచి విజయం సాధించాలి. రోహిత్ 'నాట్యం' సినిమా చూశాను. అతనిలో చాలా మంచి డ్యాన్సర్, యాక్టర్ ఉన్నారు. ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అలాగే అపర్ణాకి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దశరథ్ అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడు. నిర్మాత కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుతున్నాను' అని తెలిపారు. 'ఈ సినిమాని దశరథ్ స్టయిల్లో ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ తీశారు. ఈ సినిమాని నార్వేలో షూట్ చేశారు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. మన చౌదరికి సినిమా తప్ప మరో ప్రపంచం తెలీదు. సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నాను. మీరంతా ఖచ్చితంగా ఆదరిస్తాని అనుకుంటున్నాను. ఇందులో దశరథ్ కూడా ఒక పాత్ర పోషించారు. చాలా మంచి పాత్ర అది. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ ఉంది' అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు.
'ఖమ్మం షూటింగ్లో అజరు చాలా సహకారం అందించారు. హరీష్ తన విలువైన సూచనలు ఇచ్చారు. టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కావాలి' అని నిర్మాత డివై చౌదరీ చెప్పారు. హీరో రోహిత్ బెహల్ మాట్లాడుతూ,'దశరథ్, డివై చౌదరికి కృతజ్ఞతలు. రామ్ పాత్ర నేను చేయగలనని నమ్మారు. అపర్ణతో కలసి నటించడం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'నా తొలి తెలుగు సినిమా టీజర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, సపోర్ట్ కావాలి' అని హీరోయిన్ అపర్ణ తెలిపారు.
ఈ సినిమాకి హరి పని చేశారు. 'మిస్టర్ పర్ఫెక్ట్'తో మా జర్నీ మొదలైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రానికి పని చేశారు. స్క్రీన్ ప్లే కిషోర్, శివ అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాస్తున్నారు. ఉద్ధవ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కె వేద మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాకి బ్యాక్ బోన్‌గా ఉంటున్న దొడ్దా రవికి థ్యాంక్స్.
- నిర్మాత, దర్శకుడు కె. దశరథ్