Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రవితేజని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ ఇది. ఆయన నుంచి వరుసగా సీరియస్ సినిమాలు వస్తున్నాయి. ఆయన బలం ఎంటర్టైన్మెంట్. నా బలం కూడా అదే. ఇద్దరం కలిసి మంచి ఎంటర్టైనర్ చేయాలని 'ధమాకా' చేశాం' అని రచయిత ప్రసన్న కుమార్ చెప్పారు.
రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'వివేక్, నేను కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నాం. అదే సమయంలో నా వర్క్ నచ్చి రవితేజ అభినందించాలని పిలిచారు. ఆయనతో కొన్ని రోజుల జర్నీ తర్వాత 'ధమాకా' కథ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఆయనకి నచ్చేసింది. ఇది డబుల్ ఇంపాక్ట్ ఉండే సబ్జెక్ట్. అంటే ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్‌ని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తాయనే దానిపై బేస్ అయిన సినిమా. 'రౌడీ అల్లుడి'కి మరో వెర్షన్‌లా ఉంటుంది. దర్శకుడు త్రినాథరావుతోనే ఎక్కువ సినిమాలు చేయటానికి కారణం, నేను ఒక సీన్ చెబితే దాని అవుట్ పుట్ ఎలా వుంటుందో ఆయనకి తెలిసిపోతుంది. మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది. ఇందులో రావు రమేష్, హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్‌గా ఉంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా బాగుందన్నారు. అలీ పాత్ర, మచ్చ రవి, సత్యం రాజేష్ ఎపిసోడ్లు, హీరో, హీరోయిన్ మధ్య సీక్వెన్స్‌లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్‌ని డిసైడ్ చేసే ఎంటర్టైన్ మెంట్ సీక్వెన్స్. ఈ సినిమాని హిందీలో 'బిగ్ ధమాకా' పేరుతో విడుదల చేస్తున్నాం. రవితేజకి హిందీలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ కూడా ఈ సినిమా హిట్ కొడితే హ్యాపీ. ప్రస్తుతం నాగార్జున కోసం ఒక స్క్రిప్ట్ చేస్తున్నాను. ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. నా సొంత కథే. విశ్వక్ సేన్ చేస్తున్న 'దాస్ కా ధమ్కి' షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నా' అని ప్రసన్నకుమార్ అన్నారు.