Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్ స్క్రీన్‌పై 'నారప్ప' చిత్రాన్ని చూడాలని ఎంతగానో ఎదురు చూసిన వెంకటేష్ అభిమానుల కోరిక నెరవేర బోతోంది. వెంకటేష్ బర్త్ డే కానుకగా ఆయన నటించిన 'నారప్ప' చిత్రాన్ని ఈనెల 13న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప' కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. థియేటర్లలో 'నారప్ప' రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ, 'ప్రస్తుతం బర్త్‌డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాల రీరిలీజ్‌ని ఒక ఈవెంట్‌లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా 'నారప్ప' చిత్రాన్ని ఒక రోజు థియేటర్లో వేస్తామని అమెజాన్‌ని రిక్వెస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. ఒకే ఒక్కరోజు మాత్రమే షోలు వేస్తాం. ఇందులో ఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం. సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో చర్చ జరుగుతున్న విషయం వాస్తవమే. అయితే ఎవరి సినిమాని ఆపలేం. అన్ని సినిమాలు విడుదల కావాలి. అందరికీ థియేటర్స్ ఇవ్వాలి.. బెటర్ సినిమాకి బెటర్ థియేటర్లు దొరికుతాయి అంతే తప్పితే ఒకరిని ఆపే ప్రసక్తే ఉండదు. వెంకీ ప్రస్తుతం హిందీలో ఒక సినిమా ఫ్రెండిషిప్ కోసం చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా, అలాగే రానాతో కలిసి ఒక వెబ్ సిరిస్ చేశారు. అది ఇంగ్లీష్‌లో కూడా డబ్ అవుతుంది. అది వరల్డ్ వైడ్ షో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆడియన్స్ నచ్చే ఎంటర్టైన్మెంట్ని ఎక్కడున్నా తప్పకుండా చూస్తారు. ఇక నా కొడుకు అభిరామ్ 'అహింస' సినిమా రిలీజ్ కోసం మంచి డేట్ చూస్తున్నాం' అని చెప్పారు.