Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్టైనర్ 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2బి ఇండియా ప్రొడక్షన్లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గోవాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో విడుదలకు ముస్తాబవుతోంది.
తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ని నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ, 'కుటుంబంతో సహా థియేటర్లో హాయిగా నవ్వుకునే చిత్రమిది. సన్నీ, సప్తగిరి పోటీపడి నటించారు. అత్యున్నత సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రజిత్ రావుకి కృతజ్ఞతలు' అని అన్నారు.
'సినిమాలపై ప్యాషన్‌తో ఈ రంగానికి వచ్చాను. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దిల్ రాజుకి కృతజ్ఞతలు. మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగానే పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు రావడం, ఇండిస్టీలో పాజిటివ్ టాక్ రావడం హ్యాపీగా ఉంది. ఇప్పటికే చిత్ర మ్యూజిక్ రైట్స్ పెద్ద సంస్థ తీసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అని చిత్ర నిర్మాత రజిత్ రావు చెప్పారు. బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృద్వీ, డిజే టిల్లు మురళి, సూపర్ విమన్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణ, గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో ప్రోడ్యుసర్లు: షేక్ రఫీ, బిట్టు (నర్సయ్య న్యవనంది), రాము వురు గొండ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, డీవోపీ: వేణు మురళీధర్, ఎడిటర్ : ఉద్ధవ్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, స్టంట్స్ : నందు, కోరియోగ్రఫీ: భాను.