Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'వాలెంటైన్స్ నైట్'. ఫన్ సాగ బ్యానర్ పై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ నారల నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. రచయిత, నటుడు హర్ష వర్ధన్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అనిల్ గొప్పగా తీశాడు. చాలా మంచి మ్యూజిక్ కూడా ఇచ్చాడు' అని తెలిపారు.'ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఇందులో చాలా సవాల్‌తో కూడిన పాత్ర చేశాను' అని హీరో చైతన్య రావు చెప్పారు. దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ,'ఈ సినిమా 90శాతం షూటింగ్ నైట్‌లోనే చేశాం. సినిమా ఇంత రిచ్‌గా రావడానికి మా డీవోపీ జయపాల్ రెడ్డి కారణం. మా నిర్మాతలు నన్ను ఎంతో నమ్మారు. మన జీవితం మన చేతిలో ఉండదు. మనం ఒక నిర్ణయం తీసుకుంటే అవతలి వారి జీవితం మీద ప్రభావం పడుతుంది. 14 పాత్రల మధ్య వాలెంటైన్స్ నైట్ రోజు ఏం జరిగిందో .. అదే ఈ కథ. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం' అని తెలిపారు. 'మా బ్యానర్ నుండి భవిష్యత్‌లో మంచి సినిమాలు వస్తాయి. అందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి' అని నిర్మాత సుధీర్ చెప్పారు.