Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ చిత్రంలోని 'సుగుణ సుందరి' అంటూ సాగే రెండో సింగిల్ ఈనెల 15న విడుదల కానుంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలకృష్ణ, శృతి హాసన్ పెయిన్ స్టన్నింగ్‌గా ఉంది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట 'జై బాలయ్య' మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో దునియా విజరు, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది.