Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న చిత్రం '18 పేజిస్'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత.
ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా గోపి సుందర్ మ్యూజికల్ మ్యాజికల్లో శ్రీమణి రాసిన 'ఏడు రంగుల వాన' పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటను పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మేము తీసిన ఈ సినిమా ఒక సాధారణ మైన లవ్ స్టోరీ కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గోపి సుందర్ ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశాడు. అవన్నీ మ్యూజికల్‌గా బిగ్ హిట్ అయ్యాయి.ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిఖిల్ చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తాడు. నాకు నేచురల్‌గా నటించించే అనుపమ అంటే చాలా ఇష్టం. ఈ నెల 23న వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా' అని తెలిపారు.
దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ,'గీతాఆర్ట్స్‌లో డైరెక్షన్ చేయడం బిగ్ హానర్‌గా భావిస్తున్నాను. నా గురువు సుకుమార్ మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చేద్దాం అన్నారు. ఇందులో నిఖిల్, అనుపమ స్టార్స్ అనే ఫీలింగ్ లేకుండా చాలా నేచురల్‌గా బాగా నటించారు. బన్నీ వాసు, అరవింద్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ,'ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్ గారి రైటింగ్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇదొక క్రేజీ లవ్ స్టోరీ. దర్శకులు సూర్యప్రతాప్ చాలా బాగా తీశాడు. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు అందరూ ఓపెన్ మైండ్‌తో రండి. సినిమా చూసిన తరువాత అందరూ కచ్చితంగా ఫ్రెష్ ఫీల్‌తో బయటకు వస్తారు' అని తెలిపారు. 'దర్శకులు ఈ కథ చెప్పినప్పుడు కథపై ఎటువంటి ఫీల్ కలిగిందో ఇప్పుడు ఆ ఫీలింగ్ డబుల్ అయ్యింది. ఇందులో నందిని క్యారెక్టర్లో నటించా. అందరూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉందని అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది' అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు.
ఇప్పటి వరకు మా బ్యానర్లో వచ్చిన సినిమాలను అదిరించి నట్లే ఈ సినిమాను కూడా ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. గోపీ సుందర్ మ్యూజిక్‌లో శ్రీమణి రాసిన 'ఏడు రంగుల వాన' పాటను
సిద్ శ్రీరామ్ చాలా అద్భుతంగా ఆలపించాడు. సింబు ఎంతో బిజీగా ఉన్నా మాకున్న స్నేహం కోసం ఇందులో 'నన్నయ్య రాసిన..' పాట పాడారు. అలాగే జానపద పాటలు రాసే తిరుపతిని ఈ సినిమాతో లాంచ్ చేస్తున్నాం. ఆయన రాసిన పాటను ఈనెల 14న రిలీజ్ చేస్తున్నాం.
- నిర్మాత బన్నీ వాసు