Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రానున్న రెండో చిత్రానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు, పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి. వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం.రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు.
దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని అందించారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో, 'ఉస్తాద్ భగత్ సింగ్' రాకను సూచించే గాలిమర, టవర్, మెరుపులతోపాటు 'ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు', 'మనల్ని ఎవడ్రా ఆపేది' అనే క్యాప్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యుత్తమ సాంకేతిక బందం పని చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్, సీఈవో: చెర్రీ, స్క్రీన్ ప్లే: కె దశరథ్, రచనా సహకారం: సి.చంద్ర మోహన్, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్,
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్, ఎడిటింగ్: చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రావిపాటి చంద్రశేఖర్.