Authorization
Mon Jan 19, 2015 06:51 pm
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సూర్య బెజవాడ నిర్మాతగా వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల సమక్షంలో టొరెంటోలో వైభవంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి కాన్సులేెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. వెన్నెల కిషోర్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ కామెడీ థ్రిల్లర్ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. దర్శకుడు వరుణ్ కోరుకొండ ప్యాషన్‌తో తెరకెక్కిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని, అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని, ఓ మంచి సినిమా నిర్మించటం గర్వంగా ఉందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ అన్నారు.