Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం 'జాన్ సే'. క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అంకిత్, తన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి, విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎస్.కిరణ్ కుమార్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'నాకు సినిమా రంగంతో అస్సలు సంబంధం లేదు. సక్సెస్ ఫుల్జాబ్, బిజినెస్‌లో ఉన్నప్పటికీ నేను అనుకునే కథలను, ఆలోచనలను సినిమా రూపంలో చెప్పాలనే ఆసక్తే నన్ను దర్శకుడిని చేసింది. 'జాన్ సే' క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే అయినా మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అలాగే ఈ సినిమా మనం రోజూ చూసే ప్రజల జీవితాలకు ఆలా దగ్గరగా ఉంటుంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకుని ప్రజెంట్ సొసైటీలో పెట్టాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలివిగల, ఝాన్సీ లక్ష్మీభాయి వంటి తెగువ కలిసి ఉండే అమ్మాయి ఈ సొసైటీని ఎలా ఫేస్ చేస్తుంది అనేది మెయిన్ లైన్. తనికెళ్ళ భరణి, సూర్య, అజరు, బెనర్జీ, ఐ డ్రీమ్ అంజలి లాంటి ఆర్టిస్టులతోపాటు, సాంకేతిక నిపుణులందరూ చాలా బాగా చేశారు. వాళ్ళందరి సపోర్ట్ 22 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాను. మ్యూజికల్‌గా ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మొత్తం మూడు పాటలు ఉంటాయి. కథలో భాగంగా రెండు పాటలు ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. సచిన్ కమల్ మంచి సంగీతం ఇచ్చారు. 'జాన్ సే' టైటిల్ చివర త్రీ డాట్స్ ఉన్నాయి. ఆ త్రీ డాట్స్ ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఇండికేట్ చేస్తాయి. అందులో ఇద్దరి పాత్రలను త్వరలో పరిచయం చేస్తాను. మూడో పాత్ర మాత్రం సస్పెన్స్. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.ఈ సినిమాకి కథే ప్రధాన బలం. ఆడియెన్స్‌కి నచ్చేలా ఉంటుంది. వాళ్ళను థియేటర్‌కి రప్పించడానికి మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేశాం. మరో రెండు నెలల్లో సినిమా రిలీజ్ ఉంటుంది. దర్శకుడిగా నేను కొత్తవాడిని అయినప్పటికీ అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో మంచి క్వాలిటీతో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది' అని కిరణ్ కుమార్ చెప్పారు.