Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్గా రవితేజ ప్రీ లుక్ పోస్టర్, ఫస్ట్‌లుక్, టీజర్ క్యూరియాసిటీని పెంచింది. పవర్ఫుల్ పోలీస్ విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
రవితేజ కారులో ఎంట్రీ ఇస్తూ.. చేతిలో మేక పిల్లతో దిగి, విలన్స్‌ని ఇరగదీశారు. 'ఏం రా వారీ.. పిస పిస చేస్తుండావ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వనయ్యకీ యిననని'' అని వార్నింగ్ ఇస్తూ రవితేజ చెప్పిన డైలాగ్, ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకున్న పులి వస్తా ఉన్నది అనే ఇంట్రో డైలాగ్ అందర్నీ అలరిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ టెర్రిఫిక్‌గా కొరియోగ్రఫీ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌కి మరింత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం యూరప్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.