Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ, 'మహేంద్ర లాంటి నిర్మాత లభించడం మా అదష్టం. సినిమా కోసం ఆయన చాలా ఖర్చు చేశారు. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. సినిమా బాగా వచ్చింది. 'శబరి'లో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల్లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తా' అని తెలిపారు.
'ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. వరలక్ష్మి నిర్మాతల నటి. ఆమెతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం' అని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అన్నారు. దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ, 'కొత్త కథను తీసుకుని కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కించాం. ఈ చిత్రం ఒక రకంగా థ్రిల్లర్ జానర్ మూవీ అయినప్పటికీ... సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయి. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, శబరి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్ కూడా చక్కగా చేశారు' అని తెలిపారు.