Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడుహొనరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'అమ్మాయిలు అర్థంకారు'.
అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు.
శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
లేటెస్ట్గా ప్రసాద్ ల్యాబ్లో జరిగిన వేడుకలో అతిథులుగా పాల్గొన్న దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ట్రైలర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ,'సమకాలీన వాస్తవిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని మధ్యతరగతి జీవితాలలో జరిగే నాలుగు ప్రేమ జంట కథలతో ఈ సినిమాను తెరకెక్కించాను. మధ్య తరగతి జీవితాలలో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది?, దానివల్ల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో అనే అంశాన్ని ఇందులో చర్చించాం. మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో...అలాగే మధ్యతరగతి జీవితాలలో అన్ని ట్విస్టులు ఉంటాయన్న కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈషే అబ్బూరి ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది' అని అన్నారు.
'చిత్తూరు, తిరుపతి ప్రాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. మా దర్శకుడు నరసింహ నంది ఈ చిత్రాన్ని తనదైన శైలిలో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు' అని నిర్మాత కర్ర వెంకట సుబ్బయ్య చెప్పారు.