Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నమస్తే సేట్ జీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఇందులో నాయికగా నటించిన స్వప్నా చౌదరి బర్త్‌డే నేడు (బుధవారం). ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, 'ఈ పుట్టిన రోజు నాకెంతో ముఖ్యమైనది. నేను కథానాయికగా నటించిన మొదటి చిత్రం ఇంతటి ఘన విజయాన్ని సాధించడం మరిచిపోలేని అనుభూతి. 2014 నుంచి యాంకర్‌గా కొనసాగుతున్న నన్ను ఈ సినిమా సక్సెస్ సినీ పరిశ్రమలో మంచి స్థానం కల్పించింది. వాస్తవానికి సక్సెస్ చాలా ఈజీ.. దాని కోసం నిరంతరం చేసే ప్రయత్నమే చాలా కష్టం. నేను పుట్టి పెరిగిందంతా ఖమ్మంలోనే. యాంకర్‌గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరులోనూ చేశాను. సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని చిరకాల కోరిక. అయితే మొదటి సిమాతోనే అది పదిలం అవుతుందని అనుకోలేదు. అతి సహజత్వంతో, పల్లెటూరి వాతావరణంలో తీసిన మా సినిమాను అందరూ ఆదరించారు. మనం ఉన్న స్థాయి నుంచే ఎలా ఎదగాలో తెలుసుకోవడానికి దర్శకుడు తల్లాడ సాయికృష్ణనే మంచి నిదర్శనం. ఈ సినిమా విజయం నాపై మరింత బాధ్యత పెంచింది. త్వరలోనే కొత్త సినిమా విశేషాలను తెలియజేస్తాను' అని తెలిపారు.