Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సుందరాంగుడు'. ఎం.ఎస్.కె. ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై వినయ్‌బాబు దర్శకుడిగా వి.సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించారు. విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈ సినిమాలోని 'సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే' టైటిల్ సాంగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'సినిమా రష్ చూశాను చాలా క్వాలిటీగా తీశారు. టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈనెల 17న రిలీజ్ అవుతున్న ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలి' అని చెప్పారు. 'ఈ టైటిల్ సాంగ్‌ని దర్శకుడు వినయ్ బాబు రాశారు. రవికృష్ణ కొరియోగ్రఫిలో వచ్చిన ఈ పాట అందరికి నచ్చుతుంది. నేను, చంద్ర గౌడ్ రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఉన్న 6 సాంగ్స్, సీన్స్, ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. మా సినిమా ప్రివ్యూ చూసిన సినీపెద్దలు, సెన్సార్ అధికారులు బాగుందని ప్రశంసించారు. ఈ సినిమాకి వచ్చే డబ్బుని మా కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి వినియోగిస్తాం' అని హీరో కృష్ణసాయి అన్నారు.