Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్'. దీనికి సీక్వెల్‌గా రాబోతున్న 'అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్'ని రూపొందించారు.
ఈ సినిమా కోసం విశ్వ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'అవతార్' రికార్డ్స్‌ని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, తెలుగు వెర్షన్ కూడా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఓ అప్డేట్ అందర్నీ సర్ప్రైజ్ చేసింది. నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. ఆయన ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కి డైలాగ్స్ రాశారు. తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటారని అందరూ ఆశిస్తున్నారు.