Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధన్య బాలకష్ణన్, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జగమే మాయ'. ఇన్స్టంట్ కర్మ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై ఉదరు కిరణ్ కోలా, విజరు శేఖర్ అన్నే నిర్మించారు. క్రైమ్ డ్రామా కథతో దర్శకుడు సునీల్ పుప్పాల తెరకెక్కించిన
ఈ చిత్రం నేటి నుంచి (గురువారం) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన ప్రెస్మీట్లో హీరోయిన్ ధన్య బాలకష్ణన్ మాట్లాడుతూ, 'ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా మీద వెళ్లే సినిమా ఇది. మనలో ఎవరూ బ్లాక్ అండ్ వైట్ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండరు. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయని చెప్పే కథ ఇది' అని అన్నారు. 'జీవితంలో మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే..ఆ బ్యాడ్ మనకే జరుగుతుంది అని చెప్పే చిత్రమిది' అని తేజ ఐనంపూడి చెప్పారు. దర్శకుడు సునీల్ పుప్పాల మాట్లాడుతూ, 'కథ చెప్పగానే మా ప్రొడ్యూసర్ ఏ ప్రశ్నలు లేకుండా బడ్జెట్ ఎంత అన్నారు. అంతగా స్క్రిప్ట్‌ను నమ్మారు' అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ, 'సక్సెస్ ఫుల్‌గా ప్రాజెక్ట్‌గా దీన్ని కంప్లీట్ చేశాం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మా సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి' అని అన్నారు.