Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ఎస్ 5.. నో ఎగ్జిట్'. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) దర్శకుడు. శౌరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హర్రర్్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ అవినాష్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయిక నందితా శ్వేత మాట్లాడుతూ, 'హర్రర్ సినిమా చేయటంతో నాకు హర్రర్ క్వీన్ అని పేరొచ్చింది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా' అని అన్నారు. 'మా టీజర్‌కి వస్తున్న ఈ అపూర్వ స్పందన చూస్తుంటే సినిమా విజయం ఖాయమని అర్థమవుతోంది' అని నిర్మాతలు చెప్పారు. దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ,'మీకు నచ్చే హర్రర్ థ్రిల్లర్ ఇది. మణిశర్మ సంగీతం, గరుడ వేగ అంజి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది' అని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం ఇప్పటిదాకా ఎవరు యూజ్ చేయని టెక్నాలజీ వాడాం. దర్శకుడు భరత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక ట్రైన్ బోగిలో హిలేరియస్ హర్రర్ జర్నీ చూస్తారు' అని చెప్పారు.