Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్‌లోని కాచిగూడలో ఉన్న 'తారకరామ' థియేటర్ వైభవంగా పునః ప్రారంభమైంది. నందమూరి తారక రామారావు పై ఉన్న అభిమానంతో నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ 'ఏషియన్ తారకరామ' థియేటర్ని పునరుద్ధరించారు. బుధవారం ఈ థియేటర్ బాలకష్ణ, నిర్మాత శిరీష్ గ్రాండ్‌గా ఆరంభమైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'తారకరామ థియేటర్‌కి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిస ివచ్చేటట్లు కట్టిన దేవాలయం. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ని ప్రారంభించాం. తర్వాత 95లో రెండోసారి, ఇప్పుడు మూడోసారి దీన్ని పున: ప్రారంభించాం. అందరికీ అందుబాటులో టికెట్ ధర ఉండటం ఇండిస్టీకి ఆరోగ్యకరం' అని చెప్పారు.