Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తల్లి, ప్రముఖ రచయిత కె.శివశక్తి దత్త సతీమణి భానుమతి (82) కన్ను మూశారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె పోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. శివశక్తి దత్త, భానుమతి దంపతులకు సంగీత దర్శకులు కీరవాణి, కళ్యాణ్ కోడూరితోపాటు శ్వేతనాగ, మల్లేశ్వరి, కాంచి, సప్తమి సంతానం. భానుమతి అంతిమ సంస్కారాలను గురువారం హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భానుమతి కన్ను మూశారన్న విషయం తెలుసుకున్న కథానాయకుడు పవన్కళ్యాణ్తోపాటు పలువురు సినీ ప్రముఖులు కీరవాణి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.