Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్ర ఎనౌన్స్మెంట్ గురువారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకుడు. వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తుండగా, పోలూరి ఘటికాచలం కథ, మాటలు సమకూరుస్తున్నారు. ఇదే బ్యానర్లో తొలి చిత్రంగా తెరకెక్కిన 'ఐక్యూ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ, 'ఈ నెల 19న కొత్త సినిమా షూటింగ్ అనంతపురంలో స్టార్ట్ అవుతుంది. మా 'ఐక్యూ' సినిమాలో ఉన్నవారినే ఈ చిత్రంలో కూడా తీసుకున్నాం. సుమన్ ఈ చిత్రానికి చాలా హెల్ప్ చేశారు. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. మంచి కథ ఉంటే సుమన్‌తో ప్రొడక్షన్ నెం.3గా సినిమా చేస్తాను' అని అన్నారు.
''ఐక్యూ' చిత్రం మొదటి కాపీ రావడం, ఇదే బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా ఎనౌన్స్మెంట్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. భారీ తారాగణంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ చాలా చక్కగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు' అని దర్శకుడు జిఎల్బి శ్రీనివాస్ తెలిపారు.
'ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అలాగే పల్లె రఘునాధ్‌రెడ్డి కలెక్టర్ పాత్రలో కనిపిస్తారు' అని హీరో సుమన్ అన్నారు.
హీరో భూషణ్ మాట్లాడుతూ, 'జిఎల్బి శ్రీనివాస్‌తో సినిమా ఇప్పటికి కుదిరింది. సుమన్‌తో కలిసి గతంలో ఓ చిత్రంలో నటించాను. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని తెలిపారు. 'ఓ మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని హీరోయిన్ అంకిత చెప్పారు.