Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా 'భాగ్ సాలే'. క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేనిలతో కలిసి కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ సాయి దర్శకుడు. అనేక చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన కళ్యాణ్ సింగనమల ఈ చిత్రంతో నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో కళ్యాణ్ సింగనమల మాట్లాడుతూ, 'నేను అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐని. గత 14 ఏళ్లుగా ఫైనాన్షియర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పలు చిత్రాలకు బాధ్యతలు నిర్వహించాను. అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు వర్క్ చేశాను. మధుర ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'ఫ్యాషన్ డిజైనర్', 'సన్ ఆఫ్ లేడీస్ టైలర్', 'మాయా' చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా ఉన్నాను.
స్నేహితుల ప్రోత్సాహంతో పాటు 'భాగ్ సాలే' కథ ఎగ్జైట్ చేయడంతో ప్రొడ్యూసర్‌గా మారాను. క్రైమ్ కామెడీ జోనర్ కథలో సోషియో ఫాంటసీ అంశాలు కలిపి ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అనుభూతిని ఇస్తుంది. హీరో శ్రీ సింహా ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే కథ ఇది. దర్శకుడు ప్రణీత్ సాయి ఈ కథను మన ఊహకు అందనంత బాగా రాశాడు. ప్రతి సీన్ కొత్తగా, నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో హీరో సినిమా అంతా పరుగులు పెడుతూనే ఉంటాడు. అలాంటి రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. నా దృష్టిలో సినిమాకు కథే హీరో. ఇప్పుడున్న ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉన్నారు. కథ బాగుంటే చాలు హీరో ఎవరనేది కాకుండా సినిమాను ఆదరిస్తున్నారు. మా సంస్థలో అన్ని తరహా మూవీస్ నిర్మిస్తాం. ప్రస్తుతం మూడు చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాను. 'అహనా పెళ్లంట' ఫేమ్ సంజీవ్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు' అని తెలిపారు.