Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొలిటికల్, సినీ జర్నలిస్ట్‌గా, పీఆర్ఓగా, శాటిలైట్ కన్స్ల్ టెంట్‌గా సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన వ్యక్తి కె.రాఘవేంద్రరెడ్డి. ఆయన 'శాసనసభ' చిత్రం ద్వారా రచయితగా పరిచయవు తున్నారు. ఇంద్రసేన హీరోగా, వేణు మడికంటి దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్ నిర్మించిన పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ 'శాసనసభ'. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
''శాసనసభ' కథ రాయడానికి కారణం హీరో ఇంద్రసేన. ఆయన నాకు మంచి ఫ్రెండ్. మొదట్లో 'అసెంబ్లీ' అనే వర్కింగ్టైటిల్తో ఈ సినిమా ప్రారంభించాం. ఈ సినిమా కథ నచ్చి సప్పని బ్రదర్స్ ముందుకు వచ్చారు. 'కేజీఎఫ్, కేజీఎఫ్-టు' తరువాత రవిబసూర్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆయన మా సినిమాకు సంగీతం అందించడం కేవలం నిర్మాత షణ్ముగం సప్పని వల్లే సాధ్యపడింది. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణంగా ఉంటుంది. రాజకీయాల్లో జరిగిన సంఘటనల స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశాను. శాసనసభ అంటే పవిత్రస్థలం దానిని దేవాలయంగా భావించాలి. కానీ నేడు శాసనసభ విలువ మసకబారుతున్నట్లు అనిపించింది. అందునే దాని విలువను ఈ తరం వాళ్లకు తెలియజెప్పాలి అనే ఉద్దేశమే ఈ సినిమా. దీనికి కమర్షియలాలిటి యాడ్ చేశాం. ఏ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయలేదు. కాని రాజకీయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను డిస్కస్ చేశాం. ఓటు విలువ తెలియజెప్పడం కోసం చేసిన కథ. అలాగే అందరికి బాధ అనిపించే ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇందులో రాజేంద్రప్రసాద్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. దర్శకుడు వేణు మడికంటి తన ప్రతిభతో చక్కగా తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశం ఎంతో కన్వీన్సింగ్‌గా ఉంటుంది. ప్రస్తుతం మరో పాన్ ఇండియా కథ తయారు చేశాను. అలాగే ఎన్ఆర్ఐ నిర్మాతలు నా కథతో ఓ యాక్షన్ ఇన్విస్టిగేషన్ థ్ల్రిలర్‌ను నిర్మిస్తున్నారు. సినిమా అంతా విదేశాల్లోనే షూటింగ్ జరుగుతుంది. ఇది కూడా సమాజానికి ఉపయోగపడే కథ. దీంతోపాటు మరో క్రైమ్ థ్రిల్లర్‌కు కూడా కథ అందించాను' అని రాఘవేంద్రరెడ్డి తెలిపారు.