Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కులను 'అమ్మదొంగ' చిత్ర నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని 'పులి' అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్.సుధాకర్ బాబు మాట్లాడుతూ,'సమాజంలో అసమానతలపై పోరాడిన ఓ వీరుడి కథ ఇది. అలాగే అనంతపద్మనాభ స్వామి నగలకు సంబంధించిన చరిత్ర కూడా ఇందులో ప్రధాన కథాంశం. దర్శకుడు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సినిమాలో ప్రతి సన్నివేశం క్లైమాక్స్‌లా ఉంటుంది. ప్రతి ఫ్రేము రిచ్‌గా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న నాలుగు పాటలు కూడా ఎక్స్టార్డినరీగా ఉంటాయి. త్వరలోనే పాటలు కూడా విడుదల చేస్తాం. 'బాహుబలి, ఆర్ ఆర్ ఆర్' స్థాయిలో 'పులి' సినిమా ఉంటుంది. థియేటర్లో అనుభూతి చెందాల్సిన సినిమా ఇది. మా స్నేహితుడు ప్రసాద్ కూడా ఈ చిత్రంపై ఉన్న ఆసక్తితో సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు. ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. ఎస్.కె ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ,'ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్, స్టన్నింగ్ మ్యూజిక్.. దర్శకత్వం. కథ.. అన్నీ అద్భుతాలే. ఇది ఈ కాలానికి సరిగ్గా సరిపోయే కథ. సుధాకర్ బాబుతో కలిసి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాం.' అని అన్నారు.