Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించిన సినిమా 'వాళ్ళిద్దరి మధ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించారు. కాంటెంపరరీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా నేరుగా నేటి నుంచి (శుక్రవారం) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ, 'అర్జున్ దాస్యన్ నా కెరీర్లో చూసిన బెస్ట్ ప్రొడ్యూసర్. సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రమిది. రెండు షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్లో విరాజ్ అశ్విన్ బాగా నటించాడు. హాలీవుడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న నేహా కృష్ణను ముందు తెలుగు సినిమా చేయమని తీసుకొచ్చాను. నాకు మరొక మంచి సినిమా అవుతుంది' అని చెప్పారు.
'కుటుంబంతా కలిసి హాయిగా చూసేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా విషయంలో రెండు సంస్థలకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మేము మొత్తం వర్క్ చేసుకున్న ప్రసాద్ ల్యాబ్స్ సంస్థ. రెండవది రిలీజ్ చేస్తున్న ఆహా ఓటీటీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనే మాలాంటి నిర్మాతలకు ఒక మంచి ఆప్షన్ అయ్యింది ఆహా. మా సినిమాను ఆహాలో చూస్తారని ఆశిస్తున్నాం' అని నిర్మాత అర్జున్ దాస్యన్ అన్నారు.
ఆహా నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, 'విఎన్ ఆదిత్య, నేనూ ఒకే కాలేజ్లో చదువుకున్నాం. ఆయన కైండ్ ఆఫ్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇదొక యూత్ పుల్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. ఆహాలో చూసి ఎంజారు చేయండి' అని చెప్పారు. హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, 'ఇందులో నాది ఆల్ మోస్ట్ డ్యూయల్ రోల్ లాంటి పాత్ర. నేను నటించగలనా అని భయమేసింది. ఆదిత్య ఇచ్చిన ధైర్యంతో ఈ క్యారెక్టర్ని బాగా చేశాను. నా కెరీర్లో గుర్తుండే సినిమా అవుతుంది' అని తెలిపారు.