Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో ఆది సాయి కుమార్ నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ 'టాప్ గేర్'. కె. శశికాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ని ఈనెల 18న రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈనెల 30న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్గా సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాట, చిత్ర టీజర్.. ఇలా అన్నీ కూడా ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి చిత్రయూనిట్ మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించారు. టీజర్ చాలా బాగా కట్ చేశారని ఆల్ ది బెస్ట్ చెప్పారు. రియా సుమన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.