Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దమ్మాలపాటి కష్ణారావు ఆశీస్సులతో శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్ పై గతంలో 'పిల్ల జమీందార్', 'ద్రోణ', 'కళావర్ కింగ్', 'కోడిపుంజు', 'మిస్టర్ నూకయ్య' వంటి సినిమాలను నిర్మించి నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు డిఎస్ఆర్. తాజాగా ఆయన అశ్విన్ బాబుతో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
అశ్విన్ బాబు తన కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ 'రాజు గారి గది' సినిమా సిరీస్‌తో ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'హిడింబ'తో మరోసారి తన సత్తా చాటుకోబోతున్నారు. ఇలా కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటిస్తున్న అశ్విని బాబు తదుపరి చిత్రం ఒక విభిన్నమైన స్టోరీ లైన్‌తో మెడికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ చిత్రంతో ఎం.ఆర్.కష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
'సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో వరుసగా మంచి టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఉన్న చిత్రాలను నిర్మించబోతున్నాను. రాబోయే నూతన సంవత్సర ఆరంభంలో మూడు చిత్రాల నిర్మాణం చేస్తాను. ఇకపై మా ద్వారా వచ్చే సినిమాలు ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంటాయి. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా స్ట్రాంగ్ కంటెంట్‌తో ఈ మూడు సినిమాలు ఉండబోతున్నాయి' అని నిర్మాత డిఎస్ఆర్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఎం.ఆర్.కష్ణ, నిర్మాత : డిఎస్ఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తోట రమేష్, సహ నిర్మాతలు : చందు, వెంకట్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, మ్యూజిక్ : హరి గౌర.