Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడగా.. మనసిచ్చి మనసిచ్చి నచ్చా నిన్నుగా..కలగా వచ్చేశావు కళ్లకెదురుగా అలవై లాగావు నన్ను పూర్తిగా' అంటూ అందంగా పాట రూపంలో మీనాక్షిని తన ప్రేమను చెప్పేశాడా యువకుడు. ఇంతకీ కథానాయకుడు ఎవరు? అతని హదయాన్ని దోచుకున్న మీనాక్షి ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే ఆనంద్ రవి హీరోగా నటిస్తున్న 'కొరమీను' సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 31న గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతుంది. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఇందులో ఆనంద్ రవికి జోడిగా కిషోరి ధాత్రక్ జంటగా నటించింది.