Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతికి తొలుత తెలుగు సినిమాల విడుదలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే పరభాషా చిత్రాలను రిలీజ్ చేయాలనే చర్చ ప్రస్తుతం పరిశ్రమలో హట్
టాపిక్‌గా ఉంది. సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల్లో దిల్‌రాజు నిర్మించిన ద్విభాషా చిత్రం 'వారిసు' (వారసుడు) ఉంది. తమిళ హీరో విజరు హీరోగా నటించిన చిత్రమిది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. అదే రోజున బాలకష్ణ నటించిన 'వీరసింహారెడ్డి', 13న చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ, 'తమిళనాడులో నా సినిమాతో పాటు అజిత్ నటించిన 'తునివు' చిత్రం విడుదల కానుంది. అక్కడ మొత్తం 800 స్క్రీన్లు ఉంటే, మా సినిమాకి 400, అజిత్ సినిమాకి 400 స్క్రీన్లు ఇస్తామని వారు చెబుతున్నారు. విజరు స్టార్ హీరో కాబట్టి మరో 50 థియేటర్లు ఇవ్వమని వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అజిత్ చిత్రాన్ని నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే నేను ఆయన్ను కలిసి మాట్లాడతా. సినిమా అనేది వ్యాపారం. ఏ రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని తప్పుపట్టడం లేదు. ఇక్కడ మాత్రం అందరికీ నేనే కనిపిస్తున్నా. గ్లామర్‌గా ఉంటానని నన్ను టార్గెట్ చేస్తున్నారనుకుంటా' అని అన్నారు.