Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి- రవితేజ కాంబినేషన్‌ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ప్రేక్షకులు, వీరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. బాస్ పార్టీ పాట 25 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించింది సోషల్ మీడియా ట్రెండింగ్ రీల్స్‌లో నిలిచింది.
తాజాగా మేకర్స్ అనూహ్య రీతిలో అవుట్ డోర్ ప్రమోషన్లకు సిద్ధమవు తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండీలను పంపించేందుకు అద్భుతమైన పోస్టర్లను రెడీ చేశారు. పోలీసు స్టేషన్లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం నుండి చిరంజీవి స్టిల్‌ని విడుదల చేశారు. ఇందులో వీరయ్యగా చిరంజీవి ఒక చేతికి సంకెళ్లతో బ్యాగ్రౌండ్లో తుపాకీలతో గంభీరంగా కూర్చుని కనిపిస్తూ వీరయ్యా మజాకా అనేలా ఉన్నారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి, శతి హాసన్‌పై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగేందుకు జనవరి 13 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.