Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ధమాకా'. టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్‌ని నిర్మిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లేటెస్ట్గా రిలీజ్ చేశారు. స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్‌లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో 1000 మందికి ఉపాధిని ఇవ్వగలడు. మరోవైపు పావని (శ్రీలీల) వారిద్దరితో ప్రేమలో ఉంటుంది. స్వామి, ఆనంద్‌లు దారులు వేరు. కానీ విధి వారిని ఒక కామన్ శత్రువుతో పోరాడటానికి ఒకచోట చేరుస్తుంది. కథాంశం కమాండింగ్‌గా ఉంది. స్క్రీన్‌ప్లే రెసీ, ఎంటర్టైనింగ్గా, రవితేజ ఆనంద్‌గా క్లాస్‌గా కనిపించి స్వామిగా మాస్‌గా కనిపించారు. శ్రీలీల తన ఛార్మ్ నెస్‌తో ఆకట్టుకుంది. శ్రీలీలా, రవితేజ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అలరిస్తోంది. త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని పూర్తి ఎంటర్టైనర్గా రూపొందించారు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని లావిష్‌గా నిర్మించాయి. భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.