Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకు విడుదలైన 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' రెండు సింగిల్స్ స్మాషింగ్ హిట్‌గా నిలిచి ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ అవుట్ డోర్ ప్రమోషన్లను ప్రారంభించారు. థియేటర్ స్టాండీలను సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని థియేటర్లకు పంపుతున్నారు. దీని కోసమై రిలీజ్ చేసిన పోస్టర్లో బ్లాక్ షర్ట్, లేత గోధుమరంగు రంగు లుంగీతో గంభీంగా కారు పక్కన నడుస్తున్న బాలకష్ణ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ ఐకానిక్ స్టిల్ ఇప్పటికే మాస్లో బాగా పాపులర్ అయ్యింది. చివరి పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.