Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'బుట్ట బొమ్మ'. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవంశీ ఎస్., సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఎనౌన్స్ చేసిన సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ, 'నాయక, నాయికల పాత్రలు, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ సహజంగా సాగుతూ గుర్తుండిపోతాయి' అని అన్నారు. 'గణేష్ కుమార్ సంభాషణలు, వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి. చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 26న మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు.