Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషులందరూ ఒకటే. కులమత భేదాలు లేని సమాజమే ఆదర్శంగా , దళిత సంక్షేమమే ప్రధానాంశంగా1972లో సీనియర్ జర్నలిస్టు, జాతీయ అవార్డు గ్రహీత వాశిరాజు ప్రకాశం నిర్మించిన చిత్రం 'కాలం మారింది'. ఈ చిత్రం దిగ్విజయంగా 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వాశిరాజు ప్రకాశం మాట్లాడుతూ, 'ఈ కథని అప్పట్లో చాలా మంది అగ్రశ్రేణి హీరోలు నిరుత్సాహపరిచినప్పటికీ సమాజ శ్రేయస్సు, మానవతా పరిమళమే లక్ష్యంగా నిర్మించాను. చిత్ర నిర్మాణంలో దర్శకులు కె.విశ్వనాథ్, హీరో, హీరోయిన్లు శోభన్‌బాబు, శారద చక్కని ప్రోత్సాహం అందించారు. ఆర్ధికంగా ఈ సినిమా విజయం అందించడంతో పాటు మూడు నంది పురస్కారాలను కూడా కైవసం చేసుకుంది. ఈ 50 సంవత్సరాల విజయోత్సవాన్ని జనవరి నెలలో రవీంద్రభారతిలో అతిరథ మహారథుల సమక్షంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకకు దళిత బంధు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని ఆత్మీయ అతిథిగా ఆహ్వానిస్తున్నాం. నా వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్న మంత్రి వర్యులు మహమ్మద్ అలీ, కొప్పుల ఈశ్వర్‌కు కతజ్ఞతలు. ఈ సినిమాని బాపూజీకి అంకితం చేస్తున్నాను' అని చెప్పారు.