Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఏ 2 పిక్చర్స్,. సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '18 పేజిస్'. నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈనెల 23న రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, 'ఇప్పటి ట్రెండ్‌కి సరిపోయేటట్లు మోడ్రన్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 19న జరుపుతున్నాం' అని తెలిపారు. 'ఇక్కడికి వచ్చిన అభిమానులకు కతజ్ఞతలు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో సరయుగా అనుపమా పరమేశ్వరన్ మంచి పాత్రను చేసింది. ఇప్పటి వరకు మీరు చూసిన సరయు వేరు, ఈ సినిమాలో మీరు చూడబోయే సరయు వేరు.ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో అని మీకు ఈనెల 23న అర్థం అవుతుంది' అని హీరో నిఖిల్ చెప్పారు. దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ,' మా సినిమాలోని పాటలను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. ఈ కథను అరవింద్‌కి చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యారు. ఆయన స్టిల్ యంగ్. అల్లు అర్జున్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా మొదటి సినిమాకి బ్లెస్ చేయడానికి వచ్చారు. ఈ సినిమాకి కూడా బ్లెస్సింగ్ ఇవ్వడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తారు. నిఖిల్ చెప్పినట్లు ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. అరవింద్ గారి స్మైల్ మంచి ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమా చేయడానికి మంచి సపోర్ట్ అందించారు. అన్నయ్య సుకుమార్‌కి, బన్నీ వాసు అన్నయ్యకి ప్రత్యేక కతజ్ఞతలు' అని అన్నారు. 'ఈ సినిమా 23న రిలీజ్ అవుతోంది. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. అందరికీ బాగా నచ్చుతుంది.అందుకే తెరకెక్కించాం. దర్శకుడు సూర్య ప్రతాప్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ప్రేమకథ కూడా ఉంటుందా అనిపించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి బన్నీ వస్తాడు. సినిమా ఫలితంపై మేమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం' అని నిర్మాత, సమర్పకుడు అల్లు అరవింద్ చెప్పారు.