Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడులవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నా కల నెరవేరింది..
రవితేజతో సినిమా చేయడం చాలా రోజుల నా కల. పక్కా కమర్షియల్ ఫార్మెట్లో ఉండే రవితేజ మార్క్ సినిమా ఇది. నా గత చిత్రాలు 'నేను లోకల్', 'సినిమా చూపిస్తా మామా', 'హలో గురు ప్రేమ కోసమే', 'మేం వయసుకు వచ్చాం' సినిమాలు ఎనర్జిటిక్‌గా ఉంటాయి. రవితేజ ఎనర్జిటిక్ హీరో, నా సినిమాలు కూడా ఎనర్జిటిక్ ఉంటాయి. ఈ రెండు ఎనర్జీలు కలిస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో వచ్చింది. ఈ సినిమాకి 'డబుల్ ధమాకా' అనే క్యాప్షన్ పెట్టడానికి కారణం కూడా అదే. నా గత సినిమాలని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలా ఎంజారు చేశారు. దానికి రెట్టించి ఈ సినిమాని ఎంజారు చేస్తారు.
రెండు పాత్రల్ని రవితేజ అద్భుతంగా చేశారు
ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. రెండు కూడా బెస్ట్ క్యారెక్టరైజేషన్లు. డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే రెండింటికీ రెండు ఎమోషన్స్ ఉంటాయి. సినిమా అంతా క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని నడుస్తాయి. సినిమా చూసినప్పుడు చాలా కిక్ ఉంటుంది. ఇందులో బ్యూటీ ఫుల్ లవ్‌స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉన్నాయి. రవితేజ ఇమేజ్, స్టార్ డమ్‌కి తగ్గట్టు మాస్ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది.
కీర్తి సురేష్‌లా శ్రీలీల కూడా..
'నేను లోకల్' తర్వాత కీర్తి సురేష్ ఎలా బిజీ అయ్యిందో ఈ సినిమా విడుదలకు ముందే శ్రీలీల బిజీ అయ్యింది. ఆమె చాలా ఎనర్జిటిక్ అండ్ ట్యాలెంటడ్. అద్భుతమైన డ్యాన్సర్. తనే సొంతగా డబ్బింగ్ చెప్పింది. ఇందులో విలన్‌గా సరికొత్త జయరామ్‌ని చూస్తారు.అలాగే పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య గారి ట్రాక్ ఎంత ఎంజారు చేస్తామో, ఇందులో రావు రమేష్, హైపర్ ఆది ట్రాక్ అంత అద్భుతంగా ఉంటుంది.
మా ధమాకాతో క్రిస్మస్ వేడుకలు షురూ..
ఈ సినిమా మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రిలీజైన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. 'సినిమా చూపిస్తా మామా' నుండి రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో జర్నీ ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే బుల్లెట్ లాంటి డైలాగులు రాశాడు. కెమెరామెన్ కార్తి ఘట్టమనేని విజువల్స్ అన్నీ వండర్ ఫుల్‌గా ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అద్భుతమైన సెట్స్ వేశారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. క్రిస్మస్ వేడుకలు మా ధమాకాతో మొదలైపోతాయనే నమ్మకం వుంది. పరిశ్రమకి విశ్వప్రసాద్, వివేక్‌లాంటి నిర్మాతలు కావాలి. ఎక్కడా రాజీపడకుండా సినిమాల్ని నిర్మిస్తారు.