Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ది రియల్ యోగి' పుస్తకాన్ని ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ గురించి రచయిత గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది' అని అన్నారు నాగబాబు. జనసేన అధినేత, అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన 'ది రియల్ యోగి' బుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. నాగబాబు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పుస్తక రచయిత గణ మాట్లాడుతూ,'నేను పవన్ కళ్యాణ్ కులానికి, తన ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కాదు. తన పార్టీలో సభ్యత్వం కూడా లేదు. తనతో ఏ మాత్రం సంబంధం లేకుండా బయటనుండి స్వచ్చంగా ఆయన చెప్పిన మాటలు నమ్మి ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకం కోసం రిష అద్భుతమైన వర్క్ చేశారు. మెహర్ రమేష్ అద్భుతమైన వ్యక్తి. ఆయన సహకారం వలనే ఈ ఈవెంట్ జరిగింది. ఆయనకి రుణపడి ఉంటాను' అని తెలిపారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ,'పవన్ కళ్యాణ్‌లో ఒక యోగిని చూసి ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా ప్రజంట్ చేశారు గణ. కళ్యాణ్‌ని గణ ఎప్పుడూ కలవలేదు. కేవలం ఆయన మీద అభిమానంతో రాశాడు. తన సొంత డబ్బులని ఖర్చు చేశాడు. కేవలం నాగబాబుతో లాంచ్ చేయించండని మాత్రమే కోరాడు. తన సంకల్పం చాలా గొప్పది. త్రివిక్రమ్, హరీష్ శంకర్, సత్యనంద్ అందరికీ ఈ పుస్తకం పంపించాం. చాలా బావుంది. అందరికీ రీచ్ అయ్యేలా చూడమని చెప్పారు' అని తెలిపారు.