Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ది వైర్ ప్రచురించిన రెండు కథనాలు 2022 ఏడాదికి గానూ రీడింక్ అవార్డులను పొందాయి. 'రాజకీయా లు', 'మహిళా-సాధికారత మరియు లింగ సమానత్వ విభాగా లలో ఈ కథనాలు అవార్డులను సాధించాయి. ఖైదు చేయ బడిన లింగ మార్పిడి వ్యక్తుల జీవితాలపై సుకన్య శాంత కథ నం మహిళా సాధికారత మరియు లింగ సమానత్వం (ప్రింట్) విభాగంలో గెలుపొందింది. జైళ్లలో ఉన్న లింగ మార్పి డి వ్యక్తులకు పరిష్కార వ్యవస్థలు పూర్తిగా లేవని నివే దిక హైలెట్ చేసింది. అలాగే, ది వైర్ వ్యవస్థాప సంపాద కుడు సిద్ధార్థ్ వరదరాజన్ పెగాసస్ ప్రాజెక్టుపై కర్టెన్ రైజర్ రాజకీయాలు (ముద్రణ) విభాగంలో అవార్డును సొంత చేసుకున్నది. ప్రపం చవ్యాప్తంగా భారత్తో సహా ప్రభుత్వాలు జర్నలిస్టులు, కార్య కర్తలు, రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నవారు, ఇతరులపై నిఘా సాధనాలను ఎంత మేరకు ఉపయోగించో అన్నదాని గురించి ఈ కథనం హైలెట్ చేసింది.