Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీరు.కె.రెడ్డి దర్శకత్వంలో సోమా విజరు ప్రకాష్ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం 'మా ఊళ్లో ఒక పడుచుంది'. దెయ్యమంటే భయమన్నది అనేది ఉపశీర్షిక. చిత్రీకరణ కంటే ముందు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈనేథ్యంలో భారత్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ రికార్డును నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందజేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఈ వేడుకలో మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ, 'కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి 'అవే కళ్లు'. అందులో 'మా ఊళ్లో ఒక పడుచుంది... దెయ్యమంటే భయమన్నది' అనే పాట చాలా పాపులర్. ఆ పేరుతో ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తూ రూపొందించిన ఈ చిత్రాన్ని కృష్ణ గారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా చిత్రీకరణ ముందే పోస్ట్ ప్రొడక్షన్ చేయటం విశేషం' అని అన్నారు.
తమ చిత్ర ప్రత్యేకతను యావత్ సినీ ప్రపంచం గుర్తించేలా చేసిన భారత్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ రమణారావు, ఈ రికార్డును అందించిన మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు నిర్మాత సోమా విజయ్ ప్రకాష్, దర్శకులు వీరు.కె.రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.