Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకంపై విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి బోర, కాలికేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, డా.భద్రం, సోనియా చౌదరి నటీ నటులుగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'గ్రంథాలయం'.
సాయి శివన్ జంపన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేసారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. దర్శకుడు ఇందులో సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు. 'నేను, మా బావ ఈ సినిమా తీశాం. సినిమా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యప్ప అన్నారు.
దర్శకుడు సాయి శివన్ జంపన మాట్లాడుతూ,'ఈ సినిమా కంటే ముందు 'వైరం' చేశాను. అది సగం సినిమా పూర్తి అయ్యింది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాక ముందే నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలోని సగభాగం చేవెళ్ళలో చిత్రీకరణ చేశాం. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది' అని తెలిపారు. 'డైరెక్టర్ సాయి శివన్ ఈ సినిమాను చాలా బాగా తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని హీరో విన్ను మద్ది పాటి చెప్పారు.