Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'చెడ్డీ గ్యాంగ్ తమాషా'. గాయత్రి పటేల్ హీరోయిన్. అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా నిర్మితమవు తోంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బ్రహ్మానందం ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాని ఎంతో కష్టపడి అద్భుతంగా తెరకెక్కించాడు. ట్రైలర్ చాలా సహజంగా ఉంది. నిర్మాత క్రాంతి కిరణ్ చెడ్డి గ్యాంగ్ 2 తీస్తాడు. అలాగే వరుసగా సినిమాలు తీస్తూ మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాం. మేం చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్2 కూడా ఉంటుంది. ఆన్నీ కుదిరితే పార్టీ2లో బ్రహ్మానందం కూడా నటిస్తారు' అని నిర్మాత క్రాంతి కిరణ్ తెలిపారు.
'మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు వెంకట్ కళ్యాణ్. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకుంటాడు. నిర్మాత క్రాంతి కిరణ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను' అని జనసేన తెలంగాణ యూత్ లీడర్ సంజయ్ నాయక్ అన్నారు. హీరోయిన్ గాయత్రి పటేల్ మాట్లాడుతూ, 'ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపిస్తాను. నాకు ఈ ఆవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని తెలిపారు. ఈ వేడుకలో గేయ రచయిత మాస్టర్ జి, విహారితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి డి ఓ పి: జి కె యాదవ్ బంక, సంగీతం: అర్జున్ నల్లగొప్పుల, ఎడిటింగ్: నర్సింగ్ రాథోడ్.
నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. ఆయన స్ఫూర్తితోనే ఇండిస్టీకి వచ్చాను. ఒక పల్లెలో భూస్వామి ఆ ఉరి జనాల్ని పీడిస్తూ ఉంటాడు. పుచ్చల పల్లి సుందరయ్య లాంటి కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి ఆ పల్లెని ఎలా కాపాడాడు అనేదే ఈ చిత్రకథ. ఇది కంప్లీట్ కామెడీ డ్రామా.అందరికి నచ్చుతుంది.
- హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్