Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వింత విచిత్రాల ప్రయోగాలు చాలా వినూత్న రీతిలో తెరమీదకి వస్తున్నాయి.
అందులో చాలా విభిన్నమైనదీ అని చెప్పుకోదగ్గ కమర్షియల్ ప్రయోగం 'రారా..పెనిమిటి'.
శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై నూతన దర్శకుడు సత్యవెంకట్ నిర్దేశకత్వంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో పాపులారిటీని సాధించిన నందితా శ్వేత ప్రధాన నాయకిగా ప్రమీల నిర్మించిన చిత్రమిది.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తం సినిమాలో ఒకే ఒక్క పాత్రగా కనిపించే నందితా శ్వేత నటనను అందరూ అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు మణిశర్మ ఐదు అద్భుతమైన మెలోడీ గీతాలను అందించారు. ఈనాటి కమర్షియల్ పాటల హౌరులో మణిశర్శ ఈ సినిమా కోసం చేసిన పాటలు మాధుర్య ప్రధానమై, సాహిత్యానికి ప్రాణమై రూపొందాయి. పాత్రలుగా తెరమీద కనిపించకుండా కేవలం డైలాగుల రూపంలో తెరమీద వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, నాగబాబు, తనికెళ్ళ భరణి, సునీల్, తాగుబోతు రమేష్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణ, శివపార్వతి చెప్పగా, హీరో పాత్రకు శివబాలాజీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, ఫస్ట్ లిరికల్ వీడియోను చిత్రసంగీత దర్శకుడితోపాటు హీరోయిన్ నందితా శ్వేత మణిశర్శ రికార్డింగ్ థియేటర్ మహతిలో విడుదల చేశారు.